కేంద్ర మంత్రులు ఇద్దరూ అసమర్థులే.. బీఆర్ఎస్ నేత షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
కేంద్ర మంత్రులు ఇద్దరూ అసమర్థులే.. బీఆర్ఎస్ నేత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఒప్పందం ప్రకారమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌ను ఔట్ డేటెడ్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీలు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల చేతిలోనే ఓడిపోయారని గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నయా పైసా తేలేని వాళ్లు కూడా కేటీఆర్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో పెడతారని సంజయ్ ఎలా మాట్లాడతారని నిలదీశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ఇద్దరు అసమర్థ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కొత్త కల్వర్టుకైనా నిధులు తెచ్చారా అని నిలదీశారు. చిల్లర మాటలు మాట్లాడి సంజయ్ తన పరువు తీసుకుంటున్నారని రావుల శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు.




Advertisement

Next Story