కార్యకర్తలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ విజ్ఞప్తి!.. ఇక నుంచి అదే మన లక్ష్యం

by Ramesh Goud |   ( Updated:2024-04-29 14:07:31.0  )
కార్యకర్తలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ విజ్ఞప్తి!.. ఇక నుంచి అదే మన లక్ష్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారని, మనం 8 సీట్ల నుంచి 13-14 సీట్లకి వచ్చేలా కృషి చేద్దామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై న్యూస్ 24 అనే చానెల్ చేసిన సర్వే వివరాలను ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకు నిర్ధేశం చేశారు. బడా భాయ్ మోడీ, ఛోటా భాయ్ రేవంత్ ల పాలన మధ్య తెలంగాణలో తీవ్ర గందరగోళం నెలకొందని న్యూస్24 తాజా సర్వేలో పేర్కొందని అన్నారు.

అలాగే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వారు అంచనా వేస్తున్నారని తెలియజేశారు. వారి అంచనాల ప్రకారం మనం 8 సీట్ల నుంచి 13-14 సీట్లు వచ్చేలా కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ సహచరులందరికీ విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై న్యూస్24 సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 40 శాతం ఓటింగ్ తో 8 స్థానాలు నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. బీజేపీ 28 శాతం ఓట్ షేర్ తో 6 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓటింగ్ తో 2 సీట్లు మాత్రమే నెగ్గి మూడవ స్థానంలో ఉండనుంది. ఇక 3 శాతం ఓటింగ్ తో ఎమ్ఐఎమ్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందని సర్వే ఫలితాలు వెళ్లడించింది.

Read More...

తగ్గేదే లే.. ఈసారి ఆధారాలతో రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed