కవితకు 15 రోజుల్లోనే బెయిల్ వచ్చేది.. ఐదు నెలలు ఉండటానికి కారణమిదే!

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:38:30.0  )
కవితకు 15 రోజుల్లోనే బెయిల్ వచ్చేది.. ఐదు నెలలు ఉండటానికి కారణమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత కేసు అని అన్నారు. మామూలుగా అయితే ఈ కేసులో కవితకు 15 రోజుల్లోనే బెయిల్ వచ్చేదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన నేతలపై కేసు పెడుతున్నారు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఐదు నెలలు దాటినా ఆమె నుంచి ఒక్క రూపాయి రికవరీ చేయలేదని గుర్తుచేశారు.

అసలు ఒక వ్యక్తి ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది అమిత్ షా నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? అని విమర్శించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవిత.. సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకానున్నారు. కవితకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story