'బీఆర్ఎస్ శ్రమ దోపిడీ సర్కార్!'

by Sathputhe Rajesh |
బీఆర్ఎస్ శ్రమ దోపిడీ సర్కార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని రోడ్డు మీద వదిలేసిందని ఇందిరా శోభన్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించిన పలువురు విద్యా వాలంటీర్లకు మూడు నెలల జీతాలు ఇవ్వలేదని ఇది శ్రమ దోపీడేనని మండిపడ్డారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. రాష్ట్రంలో 20 వేల టీచర్ల కొరత ఉందని అలాంటప్పుడు 14 ఏళ్లుగా విద్యావాలంటీర్లుగా పని చేసిన వారిని ఇటు సర్వీస్ లోకి తీసుకోకుండా అటు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను ఎలా మెరుగు పరుస్తారని ప్రశ్నించారు.

విద్యా వాలంటీర్ల సమస్యను గతంలో తాను మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అయినా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణలో విద్యావాలంటీర్లను ఎందుకు వివక్షకు గురి చేస్తున్నారని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి రాజకీయ ఉద్యోగాలు వస్తే అది మీకు ఆత్మగౌరవం మరి తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం అక్కర్లేదా అని ప్రశ్నించారు. విద్యా వాలంటీర్లకు వారి ఉద్యోగమే ఆత్మగౌరవం అని వారు చేసిన పనికి వేతనంతో కుటుంబాన్ని కాపాడుకోవడం ఆత్మగౌరవం అవుతుందని అన్నారు. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story