- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: తిట్టి పోయడమే సంబరమా..? మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
దిశ, తెలంగాణ బ్యూరో : తిట్టి పోయడమే సంబరమా? అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Former Minister Ponnala Lakshmaiah) ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna), రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్(Dasoju Sravan), చాడ కిషన్ రెడ్డి(Chada Kishan Reddy)తో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్(BRS) ను ఎదుర్కునే దైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్(Challenge) చేశారు. వేదిక ఏదైనా సీఎం(CM Revanth Reddy) అలానే మాట్లాడతారా ?సిగ్గుండాలి అని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం ఇట్లనే మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. ధాన్యం ఉత్పత్తి క్రెడిట్ సీఎం తీసుకుంటారా? ఈ పది నెలల్లో సీఎం ఏం చేశారని క్రెడిట్ తీసుకుంటారు? అని నిలదీశారు. సాగర్ టెయిల్ పాండ్ నుంచి 3 టీఎంసీ లు దొంగిలించుకు పోయినా చోద్యం చూశారు, సమక్క బ్యారేజి నుంచి వృధాగా 30 టీఎంసీ లు గోదావరి లో కలిస్తే ఏం చేశారు ? దేవాదుల రిజర్వాయర్ల లో ఇప్పటీకీ నీరు నింపలేదు అని మండిపడ్డారు.
కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే భూగర్భ జలాలు పెరిగాయని, పంట దిగుబడి పెరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితి మీద రేవంత్ కు అసలు అవగాహన ఉందా? అని ఎద్దేవా చేశారు. నాతో ఆర్థిక పరిస్థితి మీద చర్చకు వస్తావా రేవంత్ ? అని సవాల్ చేశారు. టీఆర్ఎస్ మొక్క కాదు... మహా వృక్షం..అంతం చేయడం రేవంత్ వల్ల అవుతుందా? అని ప్రశ్నించారు. రేవంత్ కుటుంబ సభ్యుల కోసం కొడంగల్ లో ఫార్మా తెచ్చి పేద రైతులను వేధిస్తారా ?.. ఎప్పుడైనా భూ సేకరణ కోసం సీఎం రైతుల్తో మాట్లాడారా ? అని ప్రశ్నించారు. రేవంత్ పాలన ఆశ్రిత పక్ష పాతం తో కూడిన పాలన అని ధ్వజమెత్తారు. రేవంత్ ఖబడ్ధార్ ...ఇకనైనా పద్ధతి మార్చుకో వాలని హితవు పలికారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అబద్దాల చక్రవర్తి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఖాతాల్లో తప్పులే కారణమని నిన్న మరో అబద్దం ఆడారని, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇదే ఖాతాదారులకు రైతు బంధు వేశారు.. ఇప్పుడు ఎందుకు అడ్డంకి గా మారాయి? అని ప్రశ్నించారు. రేవంత్ లాంటి వాడు సీఎం అయినందుకు తెలంగాణ ప్రజలు బాధ పడుతున్నారన్నారు.