రైతులకు నీరు ఇవ్వకుండా మోసం చేసిందే BRS: ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

by Satheesh |
రైతులకు నీరు ఇవ్వకుండా మోసం చేసిందే BRS: ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, నష్టం, అవినీతి, దోపిడీపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్‌పై శనివారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు నీరిస్తామని, ధర్మపురికి కూడా నీరిస్తామని చుక్కనీరు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్ని విధాలా నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నీరివ్వకుండా గజ్వేల్, సిరిసిల్లకు నీటిని తీసుకెళ్లారన్నారు. రైతులకు నీరివ్వకుండా మోసం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డకు తీవ్రనష్టం జరిగిందన్నారు.

Advertisement

Next Story