- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ.. దళితులపై బీఆర్ఎస్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో దళితులను ఆకట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇందులో భాగంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు భారీ జనాన్ని సమీకరించాలని ప్లాన్ వేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి దళితులను అధిక సంఖ్యలో హైదరాబాద్ కు తీసుకురావాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో వారితోనే ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నది. ప్రజల తరలింపునకు ఇప్పటికే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను బుకింగ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యక్రమాన్ని వీక్షించేందుకు విగ్రహావిష్కరణ స్థలం వద్ద ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో
ప్రజల తరలింపునకు 750 ఆర్టీసీ బస్సులతోపాటు వెయ్యికి పైగా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో, గ్రామాల్లో యాక్టి వ్ గా ఉన్న దళిత నేతలను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. దళితబంధు లబ్దిదారులను సైతం ఆవిష్కరణ సభకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కు వెళ్లి రావడానికి రవాణా సౌకర్యంతోపాటు భోజన ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు సమాచారం. కాగా, విగ్రహావిష్కరణతో రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.