- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓటమిని విశ్లేషిస్తున్న గులాబీ అధిష్టానం, ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతోంది. ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. దీంతో పార్టీ కీలక నేతలకు ఎంపీ ఎన్నికల విషయంలో దిశా నిర్దేశం చేసే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం పడింది. ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మంత్రులు, పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్ నేతలతో ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఎంపీ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. కాగా, ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.