ఇరకాటంలో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్.. ఒకే విషయంలో ముగ్గురు దొరకడంతో టార్గెట్ చేసిన BRS..!

by Satheesh |   ( Updated:2023-09-24 04:20:05.0  )
ఇరకాటంలో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్.. ఒకే విషయంలో ముగ్గురు దొరకడంతో టార్గెట్ చేసిన BRS..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా బిల్లుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేయలేదంటూ బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. ముగ్గురు ఎంపీలున్నా ఓటింగ్ సమయంలో లోక్‌సభలో లేరని ఆ పార్టీ ఆరోపిస్తున్నది. ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి ఓటింగ్ సమయంలో ఎక్కడున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నది. క్రియాశీలకమైన మహిళా బిల్లు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నది.

కానీ ఇప్పటి వరకు ఆ ముగ్గురు ఎంపీలు నోరు మెదప లేదు. దీంతో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ ముగ్గురు ఎంపీలు ఆ దిశగా చొరవ చూపడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన మహిళా బిల్లు ఓటింగ్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు ఇలా చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓటింగ్‌లో పాల్గొన్నారా లేదా..?

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న లోక్‌సభలో బిల్లు పెట్టింది. ఆ తర్వాత రోజు చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంట ల పాటు డిస్కషన్స్ జరిగిన తర్వాత 454 మం ది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపినట్లు లోకసభ అథారిటీ ప్రకటించింది.

కానీ కాంగ్రెస్ ఎంపీలు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదనేది బీఆర్ఎస్ వాదన. పార్టీ యాక్టివిటీస్‌లో బిజీగా ఉంటూ కీలకమైన బిల్లుకు ఎంపీలు దూరంగా ఉన్నారంటూ బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వని కాంగ్రెస్ ఎంపీలు అంటూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read More: జూబ్లిహిల్స్ బరిలో మహిళలు..!

టికె‌ట్ వస్తే సరి లేదంటే తిరుగుబాటే.. సన్నద్ధం అవుతున్న సీనియర్లు

Advertisement

Next Story