- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: అక్రమ కేసులపై ఉన్న మోజు.. ఆరోగ్య శాఖపై లేకపాయే.. కేటీఆర్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: పైసల పాలనలో అన్నీ రంగాల్లో ఆవేదనలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. ఇక్కడికి రావొద్దు.. అక్కడికి పొండి! అని ఓ దిన పత్రిక(News Paper)లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్(X) వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేటీఆర్.. అక్రమ కేసులపై ఉన్న మోజు.. ఆరోగ్య శాఖ(Health Dept)పై లేకపాయే అని, అడ్డగోలు సంపాదన పై మోజు.. పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే అని ఆరోపించారు. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు.. రోగుల కష్టాలపై లేకపాయే అని, ముళ్ల కంచెలపై ఉన్న మోజు.. ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే అని, పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు.. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పై లేకపాయే అని విమర్శలు చేశారు. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మంటున్నారని, పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో ఆవేదనలు, అవస్థలు, అన్యాయాలేనని వ్యాఖ్యానించారు.