Breaking News : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం

by M.Rajitha |
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాడ్డాక పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మరింత మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(BRS Ex MLA Athram Sakku), బీజేపీ లోక్ సభ మాజీ ఎంపీ సోయం బాపురావు(BJP Former MP Soyam Bapurao) కాంగ్రెస్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా వీరికి గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mshesh Kumar Goud) కాంగ్రెస్ కందువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాపురావు, ఆత్రం సక్కు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదలకు కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, తమ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని.. వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పార్టీలో చేరామని తెలియ జేశారు.

Advertisement

Next Story

Most Viewed