BREAKING: ఆమె ఓ గద్దలా వాలిపోయేది.. స్మితా సబర్వాల్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో వైరల్)

by Shiva |
BREAKING: ఆమె ఓ గద్దలా వాలిపోయేది.. స్మితా సబర్వాల్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్‌తండా, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అర్వపల్లి, వెలుగుపల్లి గ్రామాల్లో పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయిన పలువురు అన్నదాతలను గులాబీ బాస్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంవో కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో బోరుబండ్ల హోరు వినిపిస్తున్నాయని అన్నారు.

కరెంట్ మోటర్ల వైడింగ్ వర్క్ జోరుగా నడుస్తోంది, ఇన్వర్టర్లు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. మిషన్ భగీరథను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి తాగునీరు అందించే క్రమంలో ఎందుకు సమస్య ఎదురవుతోందని అధికారులను ప్రశ్నిస్తే అసలు నిజం బయటపడిందని అన్నారు. అప్పట్లో మిషన్ భగిరథకు సెక్రటరీగా స్మితా సబార్వాల్ ఉండేదని అధికారులు తెలిపారు. ప్రతిరోజు మిషన్ భగీరథపై మానిటరింగ్ ఉండేదని, ఎక్కడైనా సమస్య ఉంటే.. ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని గద్దలా వాలి సమీక్షలు నిర్వహించే వారంటూ అధికారులు తనకు చెప్పారంటూ కేసీఆర్ గుర్తు చేశారు. నేడు మిషన్ భగీరథలో సమస్య ఉత్పన్నం అయితే 15 రోజులు గడిచినా.. సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని గులాబీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed