Breaking News: హ‌న్మకొండ జిల్లా పరిధిలో చిరుత పులి సంచారం..

by Kalyani |   ( Updated:2023-03-06 16:02:41.0  )
Breaking News: హ‌న్మకొండ  జిల్లా పరిధిలో చిరుత పులి సంచారం..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: హ‌న్మకొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం కోమ‌టిప‌ల్లి వ‌ద్ద ఓఆర్ఆర్ పై చిరుత‌పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. సోమ‌వారం సాయంత్రం స‌మ‌యంలో కోమ‌టిప‌ల్లి ఓఆర్ఆర్‌కు అత్యంత స‌మీపంలో చిరుత‌పులి సంచ‌రిస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన వాహ‌న‌దారులు భ‌యాందోళ‌న‌కు గురైన‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని వెంటనే పోలీసుల‌కు తెలియ‌జేసిన‌ట్లుగా తెలుస్తోంది. చిరుత‌పులి సంచారం వార్త దావ‌నంలా వ్యాప్తి చెందుతుండ‌టంతో ప్రజలు భ‌యాందోళ‌న చెందుతున్నారు. కత్తిగట్టు గుట్టల నుంచి ఓఆర్ఆర్ దాటుకొని కోమటిపల్లి గ్రామంలోకి ప్రవేశించినట్లు స‌మాచారం.

Advertisement

Next Story