బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-03 12:36:27.0  )
బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మైనంపల్లి రోహిత్, కుంభం అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక రేవంత్, ఠాక్రేతో కలిసి వీరు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. ఇక, తన కుమారుడికి టికెట్ కేటాయించకపోవడంతో మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వేముల వీరేశం సైతం బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిలో ఉండగా తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. వరుస చేరికలతో కాంగ్రెస్ జోష్ మీద ఉండగా.. కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed