BREAKING: తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-06 09:02:33.0  )
BREAKING: తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న తరుణంలో బీజేపీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంల భేటీలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇవాళ హైదారాబాద్‌లో అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, రేవంత్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తమకు అనవసరం అన్నారు. కానీ, రాష్ట్రానికి చెందిన ఏ ఆస్తిని కూడా తాము కోల్పోయేందుకు సిద్ధంగా లేమని హెచ్చరించారు. తెలంగాణలో పాలన అటకెక్కిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రభత్వం మాయమాటల చెబుతోందని అరోపించారు. కాంగ్రెస్ వంచనకు గురి చేసిందనే విషయం ప్రజలకు అర్థం అయిందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్​ వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా పాలనపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పల్లె బాట పట్టాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సర్పంచ్‌లు లేక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక ఏడ్చే పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed