BREAKING: గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలిస్తాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

by Shiva |
BREAKING: గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలిస్తాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చి మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని అన్నారు. సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలను ప్రకటించామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. భద్రాచలం అభివృద్ధికి తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement

Next Story