- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నేడు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి సంస్థలో దాదాపు 485 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు నేడు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌తో 317 నేరుగా, 168 పోస్టులను ఇంటర్‌నల్‌గా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంస్థ డైరెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు అంశలపై చర్చించారు. భవిష్యత్తులో ప్రమాదం సంభవించి కార్మికులు ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోనున్నట్లు సీఎండీ బలరాం వెల్లడించారు. అదేవిధంగా సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వేయి మందిని కొత్తగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఇప్పటికే సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న సమావేశమైన విషయం తెలిసిందే.