BREAKING: కాంగ్రెస్ మాయలో పడి మరోసారి మోసపోవొద్దు: మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: కాంగ్రెస్ మాయలో పడి మరోసారి మోసపోవొద్దు: మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రజలు ఒకసారి మోసపోతే నాయకుల తప్పు అవుతోందని, రెండోసారి కూడా మోసపోతే అది కచ్చతంగా ప్రజల తప్పే అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా రాజేంద్రనగర్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ మరోసారి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమై కాసానిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన హస్తం పార్టీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి యత్నిస్తోందని ఆరోపించారు. మతమే ఎజెండాగా రాష్ట్రంలో కాషాయ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. కుఠిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. ఆ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నాయని అన్నారు. బలహీనవర్గాల బలమైన గొంతుక కాసానిని చేవెళ్ల ఎంపీగా గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed