BREAKING: ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన.. తెలంగాణ సెకండ్ క్యాపిటల్‌ అదే..!

by Shiva |   ( Updated:2024-04-24 14:39:28.0  )
BREAKING: ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన.. తెలంగాణ సెకండ్ క్యాపిటల్‌ అదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌కు రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాకతీయుల చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం రాష్ట్ర రెండో రాజధాని అవ్వడం కన్నా.. సంతోషం ఏముంటుందని అన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఇద్దరు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని పేర్కొ్న్నారు. ఇప్పటికే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయాన్ని నల్లచట్టాలతో అన్నదాతల ప్రాణాలను హరించిన పాపం మోడీకి చుట్టుకుంటుందని అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీజేపీ కార్పొరేట్లకు దొచ్చిపెట్టిందని విమర్శించారు.

Read More...

పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం..

Advertisement

Next Story