BREAKING : కాంట్రాక్టు ఉద్యోగులకు CM గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |
BREAKING :  కాంట్రాక్టు ఉద్యోగులకు CM గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియేట్‌లో సీఎం కేసీఆర్ పాలనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఒక నాడు తెలంగాణ పదం ఉచ్ఛరణనే నిషేధించారని గుర్తు చేశారు. కానీ నేడు తెలంగాణ అందరికీ స్మరణీయం, ఆచరణీయం అయ్యేలా సీఎం కేసీఆర్ చేశారని చెప్పారు. అది Movement అయినా, Monument అయినా కేసీఆర్‌కి సాటి మరెవ్వరూ లేరని, రారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నూతన సచివాలయంలో మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story