- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: అమెజాన్ సంస్థలో రూ.3.22 కోట్లు స్వాహా.. సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అరెస్ట్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సంస్థలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఆ సంస్థలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. వెంకటేశ్వర్లును పోలీసులు కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సంస్థలో పని చేసి రాజీనామా చేసిన ఉద్యోగులకు చివరి రోజుల్లో సంస్థ చెల్లించే బకాయి సొమ్మును వెంకటేశ్వర్లు అప్పనంగా కొట్టేశాడు. దాదాపు సంస్థను విడిచి వెళ్లిన 184 మంది పేరిట సంస్థకు నకిలీ అభ్యర్థనలు పెట్టి దాదాపు రూ.3.22 కోట్లను స్వాహా చేశాడు. అనంతరం ఆ సొమ్మును బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లుగా అమెజాన్ యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు నిందితుడిపై సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story