BREAKING: ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-07-09 07:21:34.0  )
BREAKING: ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను మందు నుంచి ప్రోత్సహించింది హస్తం పార్టీయేనని ఫైర్ అయ్యారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది ఆ పార్టీనే అని గుర్తుచేశారు. ఇప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలోకి చేర్చుకుంటోంది కూడా అదే కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు.

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తొమ్మిది సార్లు అధికారం కట్టబెట్టారని తెలిపారు. అప్పట్లో తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని పేర్కొన్నారు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిందని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం సభిక్షంగా వెలుగొందిందని, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 3 శాతం ఓట్ల తేడాతో అధికారాని దూరమైందని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యాంరంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ బూటకపు హామీలతో గద్దెనెక్కిందని ధ్వజమెత్తారు.

పేదింటి ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు ఆశచూపి మొండిచేయి ఇచ్చారని అన్నారు. ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ సర్కార్ ఊదరగొట్టిందని, ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల ముందు 420 హామీలను ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ నేరవేర్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు మాయం అయ్యాయని.. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేర్చుకున్నారని సెటైర్లు వేశారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుపై సమాధానం చెప్పాలన్నారు. గోవా, కర్ణాటక‌లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ.. నేడు ఇప్పుడు తెలంగాణాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే ఆ ఎమ్మెల్యేను సుప్రీం కోర్టు డిస్‌క్వాలిఫై చేసిందని విషయాన్ని గుర్తు చేశారు.

పార్టీ మారే వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలంటూ గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన రేవంత్ నేడు తాము ఏం చేయాలో చెప్పాలన్నారు. తెలంగాణ‌లో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకే ఢిల్లీ‌లో మాట్లాడుతున్నామని అన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకు తప్పకుండా వెళ్తామని, అదేవిధంగా రాష్ట్రపతి‌కి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story