HYD : టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్

by Sathputhe Rajesh |
HYD : టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్‌లో బాంబు అంటూ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. ఈ ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే అదే సంస్థలో గతంలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీసీఎస్ స్టాప్ వేర్ కంపెనీలో బాంబు పెట్టానంటూ ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేయడంతో అప్రమత్తం అయిన పోలీసులు టీసీఎస్ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపించేశారు. బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. టీసీఎస్ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించిన మాదాపూర్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed