ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. బోర్డు కీలక నిర్ణయం

by Mahesh |
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. బోర్డు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డు(Telangana Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సమావేశం నిర్వహించి బోర్డు అధికారులు.. ఈ మేరకు సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. NCERT సిలబస్ ను దృష్టిలో పెట్టుకొని.. సైన్స్ సహా.. అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌(Syllabus)ను తగ్గించనుంది. కాగా ఈ సిలబస్ కుదింపు నిర్ణయం.. 2026-27 విద్యా సంవత్సరం(academic year) నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో అమలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో.. కెమిస్ట్రీలో 30 శాతం, ఫిజిక్స్ లో 15 శాతం, జువాలజీలో 5-10 శాతం వరకు సిలబస్ తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. సిలబస్ కుదింపు నిర్ణయం అమల్లోకి వస్తే.. సైన్స్ విద్యార్థులలో ఒత్తిడి తీవ్రత తగ్గడంతో పాటుగా.. పాస్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed