చిట్టి తల్లి కవితను దొంగ అంటారు: ఆకుల విజయ

by GSrikanth |
చిట్టి తల్లి కవితను దొంగ అంటారు: ఆకుల విజయ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘చిట్టి తల్లి కవిత.. దొంగను దొంగ అంటారు.. కానీ ముద్దు పెట్టుకోరు’ అని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత అమ్మింది సారా అని, అందులోనూ దొంగ సారా అమ్మిందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడి దిష్టి బొమ్మలు తగలబెట్టినంత మాత్రానా ధర్మం అధర్మం అవ్వదని, సామెత ముచ్చటను రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కవిత తెలంగాణ ఆడపిల్లల పరువు తీసిందని ద్వజమెత్తారు. బతుకమ్మ పేరుతో డైమండ్స్ కొన్నదని, జాగృతి పేరుతో ఎన్నో సెటిల్మెంట్ చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉండగా.. దొంగ సారా అమ్మేందుకు కవిత‌ను ఎందుకు ఢిల్లీకి పంపించారు? అని ప్రశ్నించారు. కవిత నీవు చేసిందే పాడు పని అని, అది కప్పిపుచ్చుకునేందుకు రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడటం ఏంటని ఇతర రాష్ట్రాల మహిళలు తనను అడిగారని అన్నారు.

ఒక దళిత మహిళ సర్పంచ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సిగ్గు చేటని, బీఆర్ఎస్ నాయకుడు ఉన్నట్టే.. ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. అందుకే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిండు సభలో డీకే అరుణను అవమానించినప్పుడు.. ఆమె ఒక మహిళ అని గుర్తు రాలేదా? బీజేపీ మంత్రిని ‘రండ’ అన్నప్పుడు మీ సంస్కృతి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. దానం నాగేందర్ ముందు నీవు నడవడం నేర్చుకో.. మమ్మల్ని గల్లీలో తిరగనివ్వరా? నాలుగు పార్టీలు మారినా నీవు మాట్లాడతావా? అని ప్రశ్నించారు. ఇకనైనా కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మానేయాలని ఎద్దేవా చేశారు. సత్యవతీ రాథోడ్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సునీత లక్ష్మారెడ్డి‌ది ఇదే ఫస్ట్ సైన్ అనుకుంటా.. అందుకే ఆమెకు అంత సంతోషంగా ఉందని ద్వజమెత్తారు.

Advertisement

Next Story