Train passengers : రైలు ప్రయాణికులకు పాముల బ్యాచ్ పరేషాన్

by Y. Venkata Narasimha Reddy |
Train passengers : రైలు ప్రయాణికులకు పాముల బ్యాచ్ పరేషాన్
X

దిశ, వెబ్ డెస్క్ : రైళ్లలో యాచకులు, హిజ్రాలు వంటి వారు ప్రయాణికులను(Train passengers) ఇబ్బంది పెట్టేలా అడుక్కుంటుండటం ఇప్పటి వరకూ అందరికి తెలిసిందే. కొందరు యాచకులు దివ్యాంగ పిల్లలను, చంటి పిల్లలను వెంటేసుకుని మరి యాచించడం చూస్తుంటాం. కొత్తగా కొందరు అడుక్కునేందుకు ఏకంగా విష పాముల(snakes)ను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాములతో భయపెడుతున్నారు. ఈ రకమైన బ్యాచ్ లు ఈ మధ్య కాలంలో తమిళనాడు, కేరళ, ఉత్తర భారత రైళ్ల సర్వీసుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కోబ్రా సహా పలు రకాల విష పాములను చేతిలో, బుట్టలో వేసుకుని బెర్త్ లలో కూర్చున్న ప్రయాణికుల మధ్యకు వచ్చి మరి వాటిని దగ్గరగా చూపిస్తూ డబ్బుల కోసం అడుక్కుంటున్నారు.

దాదాపు మీద వదిలేటట్లుగా భయపెడుతూ మరి పాముల బ్యాచ్ అడుక్కుంటుండంతో రైలు ప్రయాణికులు హడలిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రకంగా పాములతో భయపెడుతూ రైళ్లలో అడుక్కుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed