IHCL: వచ్చే ఐదు సంవత్సరాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఇండియన్ హోటల్స్

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-20 04:56:06.0  )
IHCL: వచ్చే ఐదు సంవత్సరాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఇండియన్ హోటల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group) హాస్పిటాలిటీ విభాగానికి చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) వచ్చే ఐదు సంవత్సరాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ(MD&CEO) పునీత్ ఛాత్వాల్(Puneet Chatwal) ఓ ప్రకటనలో వెల్లడించారు. 2030 నాటికి హోటళ్ల పోర్ట్‌ఫోలియో(Hotels Portfolio)ను 700కు పైగా పెంచి, సంస్థ ఏకీకృత ఆదాయాన్ని(Consolidated Income) రూ. 15,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఐదేళ్లలో సంస్థ నిర్వహించే హోటల్ గదులు సంఖ్యను 70,000కు పెంచాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం IHCL చేతిలో 232 కార్యాచరణ హోటళ్లు ఉండగా.. వాటిలో 214 హోటళ్లు మన దేశంలో ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 150కు పైగా హోటల్స్ ఉన్నాయి. హోటల్ వేట్ రీసెర్చ్(Hotelivate Research) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని కార్యాచరణ ఆస్తుల సంఖ్య పరంగా హోటళ్లలో IHCL నంబర్ వన్ కంపెనీగా కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed