Tollywood: ప్రభాస్ బాటలో మరో ఇద్దరు తెలుగు హీరోలు

by Gantepaka Srikanth |
Tollywood: ప్రభాస్ బాటలో మరో ఇద్దరు తెలుగు హీరోలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోలు(Telugu Heroes) సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. డ్రగ్స్ బారిన పడితే జరిగే నష్టాలపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా ఇప్పటికే అవగాహన కల్పించగా.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ బారినపడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకండి డార్లింగ్స్ అని పెట్టారు. ప్రస్తుతం ఆయన బాటలోనే మరో ఇద్దరు హీరోలు తమ తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. యువ నటులు అడవి శేష్, నిఖిల్ ఇద్దరూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఫేక్‌ న్యూస్‌లపై వీడియోలు విడుదల చేశారు. పూర్తి సమాచారం తెలియకుండా ఫేక్ న్యూస్‌లు షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఏమవుద్దిలే అని మనం షేర్ చేస్తుంటాం.. కానీ అది కొందరి జీవితాలను రోడ్డున పడేస్తుందని అన్నారు. దయచేసి ఏదైనా న్యూస్ షేర్ చేసేముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని నిజం అయితేనే షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story