- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Suvendhu: బీజేపీ అధికారంలోకి రాగానే మమతను జైల్లో పెడతాం.. సువేందు అధికారి
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖాలీలో జరిగిన అఘాయిత్యాలపై విచారణ జరిపి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, సీఎం మమతా బెనర్జీ(Mamath benarjee) ని జైలుకు పంపుతామని బీజేపీ నేత సువేందు అధికారి (Suvendhu Adhikari) అన్నారు. మంగళవారం ఆయన సందేశ్ ఖాలీ(Sandesh khali) లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జరిగిన దాన్ని మర్చిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారు. కానీ సందేశ్‌ఖాలీ ఘటనలను ప్రజలు మర్చిపోరు. నేను కూడా మర్చిపోలేను. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖాలీపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు మిమ్మల్ని కూడా జైలుకు పంపుతాం’ అని తెలిపారు. చట్టం ప్రకారం వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటామని, రాజ్యాంగ పరిమితులకు లోబడే నడుచుకుంటామని చెప్పారు.
షేక్ షాజహాన్ వంటి స్థానిక టీఎంసీ వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ప్రజలను శిక్షించడానికి 2024 ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలోని మహిళలపై తప్పుడు కేసులు పెట్టడానికి మమతా బెనర్జీ కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎంకు చెందిన గూండాలు, రాష్ట్ర పోలీసులు ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని ఫైర్ అయ్యారు. కాగా, రాష్ట్రంలోని పశ్చిమ బెంగాల్ లో మహిళలపై అఘాయిత్యాలకు సంబందించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలసిందే. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే ఈ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ తాజాగా ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి స్పందించారు.