Ponnam: జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోండి.. ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు

by Ramesh Goud |
Ponnam: జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోండి.. ప్రజలకు మంత్రి పొన్నం పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ఈ మేరకు ప్రజలకు న్యూఇయర్ విషెస్ చెబుతూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం(People Governance) 2024 సంవత్నరం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు(Telangana People) శుభాకాంక్షలు(Wishes) తెలియజేశారు. అలాగే రవాణా శాఖ మంత్రిగా ప్రజలు సురక్షిత ప్రయాణాలు జరుపుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపకుండా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుకున్నారు. అంతేగాక ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తకుండా.. మీ జీవితాలలో సుఖసంతోషాలు నింపుతూ కొనసాగాలని, మీకు.. మీ కుటుంబసభ్యులకు శుభం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story