గరియాబంద్ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు హతం

by Sridhar Babu |
గరియాబంద్ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు హతం
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ రాష్ట్రం గరియా బంద్ జిల్లా అమలిపాదార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందసార్, నాగోస్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచ ధ్రువీకరించారు. మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ లో గరియా బంద్ పోలీసులతో పాటు ఒడిస్సా ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ కు చెందిన భద్రతా బలగాలు పాల్గొన్నాయి.

Advertisement

Next Story