పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి

by Naveena |
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి
X

దిశ, ఆర్మూర్ : పార్టీలకు అతీతంగా సర్వసమాజ్ ఆర్మూర్ పట్టణ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఆర్మూర్ సర్వ సమాజ్ నూతన అధ్యక్షునిగా కొట్టల సుమన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..సర్వాసమాజ్ అంటే ఆర్మూర్ ప్రజా ప్రతి నిధులకు ప్రతిరూపమని, ఇక్కడ అవినీతి జరిగిన వెంటనే సర్వ సమాజ్ స్పందించాలని, పార్టీలకు అతీతంగా సర్వ సమాజ్ ఉండాలన్నారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి సర్వ సమాజ్ ప్రతినిధులు వస్తే వారికి ఎల్లపుడూ సహకరిస్తారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అనంతరం సర్వ సమాజ్ నూతన అధ్యక్షుడిగా కొట్టాల సుమన్, ఇతర కార్యవర్గ సభ్యుల చేత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి, సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ మాజీ అధ్యక్షులు ఆకుల రాజు, బిజెపి నాయకులు ఆకుల శ్రీనివాస్, గడ్డం సంజీవ్ రెడ్డి, కలిగోట్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story