RRR, ఆర్&బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై CM సమీక్ష

by Gantepaka Srikanth |
RRR, ఆర్&బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై CM సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు(Regional Ring Road), ఆర్అండ్‌బీ, నేషనల్​హైవే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కొండా సురేఖ, సీతక్క, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. కాగా, తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా సగం తెలంగాణను చుట్టేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను సైతం ఆహ్వానించింది. గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ ప్రాజెక్టును తొలి దశలో నాలుగు వరుసలుగా నిర్మించనుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఉత్తర భాగం మొత్తం వ్యయం అంచనాను రూ. 7,104.06 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. తాజాగా సమీక్షలో పనుల పురోగతిపై కీలక చర్చ చేశారు.

Advertisement

Next Story