Yadagiri News : యాదగిరి భక్తులకు గుడ్ న్యూస్

by M.Rajitha |   ( Updated:2025-01-03 13:24:53.0  )
Yadagiri News : యాదగిరి భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి(SriLaxmi NarasimhaSwamy) భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు ఆలయ నిర్వహకులు. స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులకు స్పెషల్ దర్శనం(Special Darshanam) కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ వలన వీరంతా క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న విషయం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలియజేశారు.

ఆలయ ఈవో భాస్కర్‌రావు మాట్లాడుతూ.. తూర్పు ద్వారం ముందు దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలను ఏర్పాటు చేశామన్నారు. వీరికి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల సమయంలో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. ఆలయ సిబ్బందే స్వయంగా.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను ప్రత్యేక క్యూ లైన్‌లో తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీంతో.. వారందరికీ క్యూలైన్లలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం దొరకనుంది. అదే విధంగా సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Advertisement

Next Story