- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ గ్రామంలో దొంగల బీభత్సం.. ఒకే రోజు నాలుగు ఇండ్లలో చోరీ..
దిశ, తాండూరు రూరల్ : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఒకేసారి నాలుగు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా చేసుకొని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి బంగారు ఎత్తుకెళ్లారని తెలిపారు. బంటు అంజిల్లమ్మ ఇంట్లో సుమారు రెండు తులాల బంగారం, నాలుగున్నర వేల నగదును దొంగలించారు. అలాగే పక్కింటిలో మరో రెండు వేలు దొంగలించారు.
శుక్రవారం అదే గ్రామానికి చెందిన బంటు నర్సింలు కరన్ కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నర్సింలు ఫిర్యాదు మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ లు గ్రామాన్ని సందర్శించి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఇండ్లలో పూర్తి వివరాలను సేకరించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా చోరీకి వచ్చిన వ్యక్తులు ఓ ఇండ్ల పక్కన వేసిన సీసీ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు అతని పాద ముద్రలను గుర్తించారు. దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు డీఎస్పీ, సిఐల సలహాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించారు.
స్థానికుల భయాందోళన..
దొంగలు ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండలం లో కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.