- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడిని పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal)‘రాజా రాణి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కాలా, టెడ్డీ, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు చేసింది సైడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు మూవీస్‌లో హీరోయిన్‌గా కూడా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించడంతో పాటు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss)లోనూ పాల్గొని తన పాపులారిటీ పెంచుకుంది. ఆమె చివరగా నటించిన మూవీ ‘బఘీర’.
దీని తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సాక్షి అగర్వాల్ పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్(Navneet)తో ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు(Wedding photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు.