- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RGV: ‘ముందస్తు బెయిల్ ఇవ్వండి సారూ..!’ హైకోర్టును వేడుకున్న ఆర్జీవీ
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేసిన ఆర్జీవీకి హైకోర్టు చీవాట్లు పెట్టడమే కాకుండా.. కేసుకొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపంథ్యంలో ఆయనపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆర్జీవీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఇక ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా పోలీస్ విచారణకు హాజరుకాని వర్మ.. ఇప్పుడు ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.