- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పెంపు
దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ(OU) పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్(First semester) రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు(Examination fee) చెల్లింపు గడువును పొడిగించారు. ఈ విషయాన్ని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్(COE) ప్రొఫెసర్ శశికాంత్(Professor Shashikant) ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ తదితర కోర్సుల పరీక్ష ఫీజును ఈనెల 21వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. అలాగే రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. వచ్చే నెలలో ఈ డిగ్రీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎగ్జామ్ షెడ్యూల్ పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.osmania.ac.in/ సందర్శించాలని సూచించారు.