Bandi Sanjay కీలక నిర్ణయం.. సంక్రాంతి తర్వాత షురూ!!

by GSrikanth |   ( Updated:2022-12-05 03:46:03.0  )
Bandi Sanjay కీలక నిర్ణయం.. సంక్రాంతి తర్వాత షురూ!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత మొదలుపెట్టాలని నిర్ణయిం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో పాదయాత్రకు బదులుగా బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదో విడుత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ ముందస్తు వస్తుందని జోస్యం చెప్పాడు. ఐదు విడుతల్లో భాగంగా సగం అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే కవర్ కావడంతో సంక్రాంతి తర్వాత బస్సు యాత్రను ప్రారంభించాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టిరావడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఐదో విడుత ప్రజాసంగ్రామ యాత్ర సాగుతోంది. అక్కడ ముగిసిన వెంటనే హైదరాబాద్ లో ఆరో విడుత పాదయాత్ర చేపట్టేలా రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేసుకోనున్నారు. ఈనెల చివరికల్లా ఆరో విడుత యాత్రను ప్రారంభించి 10 రోజుల్లో ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Also Read.....

బ్రేకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ నాయకులు పై హత్యాయత్నం

Advertisement

Next Story