- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ ప్రజాపాలన అంటే ఇదే.. బీజేపీ సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో:పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని టీబీజేపీ విమర్శలు గుప్పించింది. రేవంత్ రెడ్డి పాలనలో ఒక్కో రోజు దారుణంగా గడుస్తున్నదని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించింది. రేవంత్ రెడ్డి ప్రజా పాలన అంటే రోజుకో అత్యాచారం, రోజుకో రైతు ఆత్మహత్య అనేలా సాగుతున్నదని, రాష్ట్రంలో రోజుకో మర్డర్ జరుగుతున్నదని ధ్వజమెత్తింది. అదుపులో లేని నేరాలు, అడ్డులేని డ్రగ్స్ కేసులు, ఆగని మూకదాడులు దోపీడీలతో రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నదని ధ్వజమెత్తింది. అంతకు ముందు హైదరాబాద్ లో వరద నీటిపై ఓ ట్వీట్ చేసిన బీజేపీ.. అభివృద్ధి పేరుతో అక్షరాలా లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపాలు చేస్తే.. ఆపద సమయంలో ఆపన్న హస్తం అవుతామని కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కానరావడం లేదని దుయ్యబట్టింది. ఇదేనా కేటీఆర్ నీటి బుడగల మీద నువ్వు కట్టిన విశ్వనగరం అని ప్రశ్నించింది. ఇదేనా రేవంత్ రెడ్డి.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకున్న ప్రజలకు మీరిచ్చే భరోసా అని నిలదీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రజల బతుకులు మార్చలేవని విమర్శించింది.