- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 మందితో కర్ణాటక స్టార్ క్యాంపెయినర్ జాబితా.. డీకే అరుణకు చాన్స్
దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధమైంది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్ లో చోటు కల్పించారు. ప్రధాని మోడీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై, యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.
తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటక కే పరిమితమై ప్రజలకు చేరువవుతున్నారు.