6 నెలల్లోనే అసలు రంగు చూపెట్టిన రేవంత్ సర్కార్.. రైతులపై లాఠీఛార్జ్ ఘటనపై బీజేపీ రియాక్షన్

by Ramesh N |
6 నెలల్లోనే అసలు రంగు చూపెట్టిన రేవంత్ సర్కార్.. రైతులపై లాఠీఛార్జ్ ఘటనపై బీజేపీ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా బారులు తీరారు. ఈ క్రమంలోనే వారిని అదుపు చేసే ప్రక్రియలో పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. రైతుల పాలిట భస్మాసుర హస్తం కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించింది. రైతులకు విత్తనాలు అందించలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అధికార మదంతో లాఠీ ఛార్జ్ చేయించడం సిగ్గుచేటని పేర్కొంది.

ప్రజా పాలన అంటూ వెర్రి ప్రకటనలు చేస్తూ ప్రజలను అష్ట కష్టాలు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు నెలల్లోనే అసలు రంగు చూపెడుతుందని రైతుల వీడియోను పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ పై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. ఢిల్లీ సరిహద్దులో వందల మంది రైతులను చంపిన ఘటన ఎవరిది? దేశంలో అత్యంత నీచమైన పార్టీ బీజేపీ అని కాంగ్రెస్ శ్రేణులు విమర్శించాయి.



Next Story