- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: యాక్టివ్ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లకి పదవులు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు మాజీ ఎమ్ఎల్‌సీ, మెంబర్‌షిప్ రాష్ట్ర ఇంఛార్జి రామచంద్రరావు అన్నారు. మంగళవారం బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. పండుగల కారణంగా తెలంగాణలో మెంబర్‌షిప్ కొంత స్లో అయ్యిందని, డ్రైవ్ వేగం పెంచడంతో నిన్న ఒక్కరోజే లక్షా 30వేల మెంబర్‌షిప్ నమోదు అయ్యిందని తెలిపారు. మిస్డ్ కాల్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా రెండు రకాలుగా మెంబర్‌షిప్ జరుగుతుందని, 4 లక్షల మిస్డ్ కాల్ మెంబర్‌షిప్ జరిగితే.. ఆన్‌లైన్ మెంబర్‌షిప్ 20 లక్షలు అయ్యిందని, మొత్తం 24 లక్షల మెంబర్‌షిప్ జరిగిందని అన్నారు.
ఇక వంద మెంబర్‌షిప్ చేసిన వారికి యాక్టివ్ మెంబర్‌షిప్ హోదా ఇస్తున్నామని, ఇప్పటిదాకా 9 వేల పై చిలుకు యాక్టివ్ మెంబర్‌షిప్ జరిగిందని, తెలంగాణలో 40 వేల యాక్టివ్ మెంబర్‌షిప్ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యాక్టివ్ మెంబర్‌షిప్ ఉన్నవాళ్ళకి సంస్థాగత పదవులు వస్తాయని చెప్పారు. దళిత మోర్చా, మైనారిటీ మోర్చా స్పీడప్ చేయాల్సి ఉందని, సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేని చోట ఆఫ్‌లైన్ మెంబర్‌షిప్ నిర్వహణ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇక ప్రజాస్వామ్య పద్ధతిలోనే అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు.