పదేళ్ల తర్వాత కేసీఆర్‌కు ఆ విషయం తెలిసొచ్చింది: రఘునందన్ రావు

by GSrikanth |   ( Updated:2024-04-01 10:21:53.0  )
పదేళ్ల తర్వాత కేసీఆర్‌కు ఆ విషయం తెలిసొచ్చింది: రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులకు నష్టం వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్‌కు పదేళ్ల తర్వాత తెలిసొచ్చిందని మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు సార్లు అధికారం అనుభవించిన కేసీఆర్.. పదేళ్ల కాలంలో పక్క పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 14 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ త్వరలో కనమరుగు కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు వాస్తవ పరిస్థితులను వివరించి, బీజేపీలోకి ఆహ్వానించాలని కాషాయ నేతలకు ఆయన సూచించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపేనని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియపరచాలన్నారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed