దయచేసి వాటికి భయపకండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ స్పెషల్ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
దయచేసి వాటికి భయపకండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సల్కం చెరువును ఆక్రమించి ఫాతిమా ఉమెన్స్ కాలేజీని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కట్టారంటూ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. మొత్తం 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలను ఆక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా కాలేజీని కట్టారని, కబ్జా చేసిన అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. గతంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డిని అక్బరుద్దీన్ ఇదే తరహాలో బెదిరించారని, చివరకు ఆయన్ను జైల్లో వేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా భయపెట్టే తీరులో హెచ్చరిక చేశారని, కానీ లొంగవద్దంటూ అప్పీల్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మద్దతు, జిల్లా కలెక్టర్ల అనుమతితోనే ఈ కబ్జా భాగోతం జరిగిందని రాజాసింగ్ ఆరోపించారు.

ఒవైసీ పెద్ద బంగ్లా నిర్మించారని, అది ప్రభుత్వ భూమిలో ఉండొచ్చని, దానిపై కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓవైసీ బ్రదర్స్ ఇద్దరూ ఎడ్యుకేషన్ పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చెరువుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విధాన నిర్ణయాలను అభినందిస్తున్నానని తెలిపారు. ఏకంగా ముఖ్యమంత్రినే భయపెట్టేలా అక్బరుద్దీన్ మాట్లాడుతున్నారని, కానీ అలాంటి ఎత్తులకు లొంగొద్దన్నారు. కేటీఆర్ కామెంట్లకు రాజాసింగ్ స్పందిస్తూ, ఆయనో చదువుకున్న మూర్ఖుడని వ్యాఖ్యానించారు. కేంధ్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్‌లో తప్పేమీ లేదన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కావడం తథ్యమన్నారు.

Advertisement

Next Story

Most Viewed