ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం కాదు.. మరో బిగ్ బాంబ్ పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే

by Satheesh |   ( Updated:2024-05-31 14:59:37.0  )
ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం కాదు.. మరో బిగ్ బాంబ్ పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, రక్షణపరమైన ఒప్పందాల్లోనూ మాజీ సీఎం కేసీఆర్ వేలు పెట్టాడని తేలుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌వి ఆరోపణలు తప్ప చర్యలు ఉండవని అసెంబ్లీలోనే తాము చెప్పామని, పేపర్ల లీకేజీ విషయంలో కూడా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కేసీఆర్ లక్కీ నంబర్ 6 అయితే కాంగ్రెస్ ఇచ్చింది కూడా 6 గ్యారెంటీలేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్.. ఏకంగా హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిందని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల్లో ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై లీకులు మాత్రమే ఇస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలకు శిక్ష పడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని, సీబీఐకి అప్పగించేలా తీర్మానం చేయాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story