ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్.. కారణం ఇదేనా..|

by Javid Pasha |   ( Updated:2023-10-19 16:21:13.0  )
ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్.. కారణం ఇదేనా..|
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రానికి చెందిన నేతకు అవకాశం కల్పించడం కీలకంగా మారింది. దీంతో ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ గిరి ఇవ్వడానికి కారణాలు ఏంటనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపే రెడ్డి వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. అలాగే అదే సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా కీలక పదవి ఇచ్చారు.

రెడ్డి సామాజికవర్గాన్ని మరింత చేరువ చేసుకునేందుకు ఇప్పుడు ఇంద్రాసేనారెడ్డికి గవర్నర్ పీఠం కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఎక్కువగా ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీలో బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించాలని కాషాయదళం భావిస్తోంది. బీసీ ఓటర్ల కోసం ఆ సామాాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువ టికెట్లు కేటాయించాలని చూస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తే రెడ్డి ఓటర్లు దూరమవుతారని బీజేపీ భావిస్తోంది. దీంతో రెడ్డి వర్గాన్ని మరింత దగ్గర చేసేందుకు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చి ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అందులో ఇంద్రసేనారెడ్డి ఎన్నో ఏళ్లుగా బీజేపీలో ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

మూడుసార్లు మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడైన దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవితో పాటు గవర్నర్ గిరి దక్కింది. కానీ ఇంద్రసేనారెడ్డికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఎన్నికల వేళ ఆయనకు గుర్తింపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed