- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ మరో ఎత్తుగడ!
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన వేళ తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నానికి మరింత పదును పెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కు ఏటీఎం గా మారిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించగా ఆ వ్యాఖ్యలకు బలం చేకూరేలా బండి సంజయ్ కాళేశ్వరం సందర్శనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఈ అంశానికి కొనసాగింపుగా బీజేపీ మరో ఎత్తుగడను వేసింది. పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు సేకరించే పనిలో బిజీ అయిపోయింది. సెప్టెంబర్ మొదటి వారంలో నీటి పారుదల నిపుణులు, పార్టీ ముఖ్యనేతలతో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయగా ఈ అంశంపై మరింత ఒత్తిడి తీసుకుచ్చేలా బీజేపీ సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి సీఎస్ కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాడు. బండి సంజయ్ పంపిన లేఖపై తీసుకున్న చర్యలపై సమాచారాన్ని ఇప్పించాలని మనోహర్ రెడ్డి అర్జీలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియజేయాలని విజ్ఞప్తి చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు అంశాలపై ఆర్టీఐని ప్రయోగించిన బీజేపీ తాజాగా కాళేశ్వరం సందర్శనకు అనుమతి ఇవ్వకపోతే అందుకు కారణాలు సేకరించే పనిలో నిమగ్నం కావడం చర్చగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్‌ను కలుస్తా.. కొట్లాటొద్దని చెప్తా: కోమటిరెడ్డి
అమిత్ షా మీటింగ్‌కూ కేసీఆర్ దూరం.. అదే రోజున రాష్ట్రంలో కీలక సమావేశం?