- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఎన్వీ సుభాష్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగలేదని, అభ్యర్థులను ఖరారు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా పలు టీవీ చానల్స్, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన ఖండించారు. వ్యక్తి ఆధారిత పార్టీల్లో మాత్రమే ఇలాంటివి చెల్లుతాయని చురకలంటించారు. ఇప్పటివరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదని ఆయన చెప్పారు. ఆ సమావేశాల అనంతరం ప్రకటన ఉండే అవకాశం ఉందని సుభాష్ తెలిపారు. భారతీయ జనతా పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అనేది ప్రజస్వామ్యయుతంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా ఎన్నికల కమిటీ కూలంకుశంగా చర్చించిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటిస్తారన్నారు. వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీలకు, ప్రజాస్వామ్యయుతంగా మెదిలే బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు.