- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు కౌంటర్.. CM రేవంత్‌పై BJP నేత మురళీధర్ రావు ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ‘పెద్దన్న’ అనడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని, ఎప్పటికైనా బీజేపీలో చేరడం ఖాయమని విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. అతి త్వరలో ఏక్‌నాథ్ షిండేలా మారి కాంగ్రెస్‌ను బీజేపీలో కలిపేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్ రావు స్పందించారు. మంగళవారం మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితి ప్రదర్శించారని అన్నారు. ప్రజలు, దేశమే ముందు అనేది మోడీ నినాదమని చెప్పారు.
తాజాగా ఇదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుసరించారని తెలిపారు. రేవంత్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే గౌరవంగా ప్రధాని ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారని కొనియాడారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టికెట్ ఆశించిన ఆయనకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. అనూహ్యంగా ఆ టికెట్‌కు ఈటల రాజేందర్‌కు కట్టబెట్టింది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మురళీధర్ రావు అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.